లోయలో పడిన టెంపో ట్రావెలర్… 10 మంది మృతి
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారు. విషయం తెలుసుకున్న NDRF బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.
శంకర్‌పల్లి రైల్వే ట్రాక్ వద్ద మహిళ మృతి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో రైలు కింద పడి మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్న సమయం లో పల్నాడు సూపర్‌ఎక్స్‌ప్రెస్ కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తు న్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో విచారిస్తు న్నారు.
పెరిగిన బంగారం వెండి ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. ఇవాళ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. రూ. 660 మేర పెరిగి తులం రేటు రూ. 72 వేల 550కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 600 పెరిగి రూ. 66 వేల 500 స్థాయికి ఎగబాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.500 మేర పెరిగింది. ఇవాళ కిలో రేటు రూ. 95 వేల 600 స్థాయికి చేరింది.


