28.2 C
Hyderabad
Monday, May 20, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

అరుణ్‌కుమార్‌ సతీమణి శశికళ ఎన్నికల ప్రచారం

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ సతీమణి శశికళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసంత కాలనీలో ఇంటింటికి తిరిగిన ఆమె వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్సీ నామినేషన్స్

వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగి యనుంది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉండగా, ఈనెల 13వరకు నామినేషన్ల ఉపసంహర ణకు గడువు.కాగా ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 41కి చేరింది.

ఓట్లు వెయ్య ఫ్లెక్సీలతో నిరసన

సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికల్ని బహిష్కరిస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు గ్రామ ఓటర్లు. తమ నిరసనను ఫ్లెక్సీల ద్వారా వ్యక్తం చేసారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామా నికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 65 కుటుంబాలకు సంబంధించి 195 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.

ఇంటర్ అడ్మిషన్స్

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్‌ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్న ట్లు విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. ప్రైవేట్‌ కళాశాల యాజమా న్యాలు ఎవరైనా ప్రవేశ పరీక్షలు నిర్వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవేశాల కోసం ప్రకటనలు జారీ చేసినా పబ్లిక్‌ పరీక్షల నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు.

సోలార్ పవర్

2023వ సంవత్సరంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా భారత్‌ నిలిచిం ది. ఇంతవరకు జపాన్‌ ఈ స్ధానంలో ఉండేది. 2023వ సంవత్సరానికి గాను ప్రపంచంలో మొత్తం విద్యు త్తులో 5.5 శాతాన్ని సౌర విద్యుత్‌తోనే సాధించినట్లు ఎంబెర్‌ మోధోమథన సంస్ధ నివేదిక పేర్కొంది. ఇది మన దేశంలో 5.8 శాతంగా ఉంది. చైనా, బ్రెజిల్‌ ఒకటి, రెండు, స్ధానాల్లో నిలిచాయి.

ఎయిరిండియా సిబ్బంది తొలగింపు

సిబ్బంది మూకుమ్మడి సెలవులపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సీరియస్‌ అయ్యింది. క్యాబిన్‌ సిబ్బందిలో 25 మందిని తొలగించింది. మిగిలిన వారు విధుల్లో చేరాలని లేకుంటే తొలగిస్తామని అల్టీమేటం జారీ చేసింది. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుతో విమానాలు రద్దయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచే సుకోవడం గమనార్హం.

దలైలామాకు పీవీ పురస్కారం

భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు స్మారక పురస్కారాన్ని బౌద్ద గురువు దలైలామాకు అందజే సారు పీవీ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు. హిమాచల్‌ప్రదేశ్‌ ధర్మశాలలోని దలైలామా నివాసంలో కలసి ఈ పురస్కారాన్ని అందించారు. ఆధునిక భారత్‌కు పీవీ వేసిన బాటను అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు దలైలామా.

రైతుల ధర్నా

కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. హమాలీల కొరత తీర్చాలంటూ డిమాండ్ చేసారు. పట్టణంలోని రామారెడ్డి రోడ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడ్డ ఇబ్బందుల్ని అధికారులు తొలగించాలని కోరారు.

వ్యక్తి అనుమానస్పద మృతి

హైదరాబాద్‌ ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి వినయ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వయస్సు 40, 45 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు స్ధానికులు. మృతుడి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదం

మంచిర్యాల జిల్లా చింతలపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం ఎడ్ల బండిని ఢీకొన్న ఘటనలో వాహనం నుండి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధం అయింది. ప్రమాదంలో లక్ష్మిపూర్‌ గ్రామా నికి చెందిన సంపత్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్సకై ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

జపాన్ లో పెరుగుతున్న ఖాళీ ఇళ్లు

జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య పెరుగుతుండటం ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. దేశంలో మొత్తం 12.5 కోట్ల మంది నివాసం ఉంటుండగా, 90 లక్షల వరకు ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెప్తు న్నాయి. జపాన్‌లో ఇలా వదిలేసిన ఇళ్లను అకియాగా పిలుస్తుంటారు. జనాభా తగ్గుదలకు ఇది అద్దం పడుతోందన్న నిపుణులు దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, జననాలు తగ్గడం మరో కారణంగా చెప్తున్నారు.

యశస్వి పై లారా కమెంట్స్

రికార్డులు కొల్లగొట్టే సత్తా యువక్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ కు ఉందన్నారు ప్రముఖ క్రికెటర్ బ్రియాన్‌ లారా. టెస్టుల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 400 పరుగుల నాటౌట్‌ రికార్డును బ్రేక్‌ చేసినా అశ్చర్యం లేదన్నారు. సీనియర్ల నుంచి నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించడం అతనికి ఉన్న పెద్ద ప్లస్‌ పాయింట్‌ గా చెప్పుకొచ్చారు లారా.

చరిత్ర సృష్టించిన ఎక్స్ కమెండో

మాజీ కమాండో హిమ్మత్‌సింగ్‌ రాఠోడ్‌ 24 గంటల్లో 70వేల 679 మెట్లు ఎక్కి చరిత్ర సృష్టించాడు. రాజస్ధాన్‌ లోని జయపురకు చెందిన 40 ఏళ్ల రాఠోడ్‌ స్పెయిన్‌కు చెందిన క్రిస్టియన్‌ రాబర్టో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకు ఈ రికార్డును సృష్టిం చినట్లు హిమ్మత్‌సింగ్‌ చెప్పాడు. 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని 81 సార్లు ఎక్కి దిగాడు.

Latest Articles

నేడు ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

   దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్