బీఆర్ఎస్ పార్టీకి షాక్
బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ లపై షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ జెడల సురేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు మరో 150 మంది అనుచరులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యే విజయరామనరావు వీరికి సాదరంగా స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వనించారు.
దానం నాగేందర్ ప్రచారం
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. గడపగడప కు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బంజారాహిల్స్, గౌరీ శంకర్ బస్తి, ఉదయ్ నగర్ల్లో వాసుల్ని కలసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభ్యర్ధించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ పాలనపై మంద కృష్ణమాదిగ విమర్శ
వైస్ జగన్ పాలన చూసి జనం ముందుకు రాలేక, ఓట్లు అడగలేక తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లి పోయిందన్నారు మంద కృష్ణ మాదిగ. కడప జిల్లా పులివెందులలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఒక హంతకున్ని తన అన్న కాపాడుతున్నాడని చెల్లి షర్మిల తిరుగుతోందని ఎద్దేవా చేసారు. ఈ ఎన్నికల్లో మాదిగల మద్దతు టీడీపీకే అన్నారు మందా కృష్ణ.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ విజ్ఞప్తి
కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్‌లో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లుకాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నా కంటోన్మెంట్‌లో రేవంత్‌రెడ్డి రెండోసారి సమయం ఇవ్వడం విశేషం అన్నారు. రేవంత్ కార్నర్ మీటింగ్‌ను యువజన, మహిళా నేతలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని శ్రీగణేష్ విజ్ఞప్తి చేశారు.
ప్రజా దర్బార్
కామారెడ్డిజిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట వాసులు ప్రజాదర్బార్ నిర్వహించారు, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులు, ఆలయం చందా డబ్బుల్ని స్వాహా చేసినట్లు సాక్ష్యాలతో రుజువు చేశారు. అభివృద్ధి పనులలో దాదాపు 6 లక్షల వరకు గోల్‌మాల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు
స్పాట్ బుకింగ్‌లను ట్రావెన్‌కోర్ దేవస్ధానం రద్దు
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్‌లను ట్రావెన్‌కోర్ దేవస్ధానం రద్దు చేసింది. మండల, మకరవి ళక్కు సీజన్ నుంచి దీన్ని అమలు చేయనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్ధానం అధికారిక వెబ్‌సైట్‌లో మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చన్న అధికారులు రోజుకు 80వేల మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాలు
ఈవీఎంల కమిషనింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను హనుమకొండ జిల్లా ఆర్‌ఓ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూంల వద్ద ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.
రెడ్డి బోయిన గోపి డిమాండ్
సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ దేవాలయం పరిసరాలు దుర్గంధభరితంగా తయార య్యాయి. పరిశుభ్రతపై మున్సిపల్ అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తోంది. హిందువుల మనో భావాలను గౌరవిస్తూ తక్షణం సమీపంలోని మరుగుదొడ్లను తొలగించాలని డిమాండ్ చేసింది బీజేపీ. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి.
చింతూరు స్వచ్ఛభారత్
అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో బి 42 బెటాలియన్ CRPF ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈనెల 12 వరకు జరగనుంది. మోతుగూడెం మార్కెట్ సెంటర్, పోలీస్‌స్టేషన్ ఆవరణలోని చెత్తను తొలగించారు CRPF సిబ్బంది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని తొలి EME సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగ నుంది. ఈ మేరకు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అగ్నివీర్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, టీడీఎస్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైన వారు 20వ తేదీ ఉదయం 5 గంటలకు హాజరుకావాల్సి ఉంది.
నీట్ పేపర్ లీక్ కాలేదు
నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – NTA ప్రకటించింది. పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని ఖండించింది. ఈ ప్రచారం పూర్తి అవాస్తమని పేర్కొంది. వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీపడబోమని NTA పేర్కొంది.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ … ఒకరు మృతి
శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు డొంక రోడ్డుకు చెందిన వి రాజారావు గా గుర్తించారు. క్షతగాత్రుల్ని చికిత్సకై ఆస్పత్రికి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.
ఆ సంస్థకు వందల కోట్ల జరిమాన
క్వాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్ధకు 550కోట్ల రూపాయలు ఫైన్ కింద చెల్లించింది. రద్దైన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ఆస్ట్రేలియా నియంత్రణా సంస్ధ ఈ మేరకు జరిమానాను విధించింది. 103 ఏళ్ల చరిత్రగల ఈ సంస్ధ ఇలా అనైతిక విధానాలను అవలంభించ డంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.


