చేవెళ్ల లో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం – సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జ్ఞానేశ్వర్ కు మద్దతుగా చేవెళ్ల మండలంలో గడపగడపకు ప్రచారం నిర్వహిం చారు. కాంగ్రెస్ పార్టీ చెపుతున్నకల్లబొల్లి మాటల్ని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. పథకాలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగండి అంటూ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.
గుంటూరు జిల్లాలో పత్తిపాటి ఎన్నికల ప్రచారం
గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను రద్దు చేసిన చరిత్ర ఏపీ సీఎందే అన్నారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించి జగన్ కోట్ల రూపాయలు దోచేశారని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమన్నారు టీడీపీ నేత పత్తిపాటి.
సీఎంరేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు -మర్రి శశిధర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు బీజేపీ నేత మర్రి శశిధర్‌రెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా రని మండిపడ్డారు. ఈనెల 11వ తేదీన వికారాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించ నున్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్న శశిధర్‌రెడ్డి తెలం గాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు.