ఈనెల 11న అమిత్ షా భీమవరం పర్యటన
నరేంద్ర మోడీ మూడో సారి దేశ ప్రధాని కావడం తధ్యమన్నారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్. భీమవరంలో జరిగిన బిసి ఆత్మీయ సభకు లక్మణ్ హాజరయ్యారు. అవకాశవాద రాజకీయాలకు తావివ్వ కుండా, ఉమ్మడి కూటమి అభ్యర్ధుల్ని ఆశీర్వదించాలని కోరారు. కాగా ఈనెల 11న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భీమవరంలో పర్యటించనున్నారు.
సుగవాసి ఎన్నికల ప్రచారం
కడప జిల్లా సిద్ధవటంలో రాజంపేట కూటమి ఎమ్మెల్యే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు సుగవాసి సుబ్రహ్మ ణ్యం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూకుడును పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్ధిం చారు. జగన్ అరాచక, అస్ధవ్యస్ధ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో లోని అంశాలను వివరించారు.
కోనేటి ఆదిమూల ప్రచారం
ప్రజారంజక పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు. కాటూరుపార్లపల్లి, పచ్చలమ్మ కాలనీ, పళ్ళమాల పదవ మైలు, బుచ్చినాయుడు కండ్రిగ, గాజులపెల్లూరు, నేర్పాకోటలో ఆయన ప్రచారం చేశారు. గత ఐదేళ్లుగా ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగిందన్నారు.
రఘునందన్ గెలపుకు తమిళసై పర్యటన
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరఫున సిద్దిపేటలో నిర్వహించిన మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే, సురక్షితంగా ఉండా లంటే మోడీకి మద్దతు ఇవ్వాలన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు ఓటు వేసి, గెలిపించాలని ఓటర్ల కు ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రజలంటే తనకు చాలా ఇష్టం అన్నారు.
పుట్ట మహేష్ ప్రచారం
ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి పుట్టా మహేష్ యాదవ్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో పర్యటించిన ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబంను పరామర్శించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, తదితరులు ఆయన వెంట ఉన్నారు.
బిందెలతో నిరసన
శ్రీకాకుళం జిల్లా హిర మండలం కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వాసులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలను చేత పట్టి రోడ్డుపై నిరసనకు దిగారు. గత పది రోజులుగా తాగునీరు అందక నానా అవస్ధలు పడుతున్నా పట్టిం చుకున్న నాధుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓట్ల కోసం వస్తున్న నాయకుల తీరును తప్పుప ట్టారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
విజయవాడలో పోలీసుల ప్లాగ్‌మార్చ్
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పోలీసులు ప్లాగ్‌మార్చ్ నిర్వహించారు. స్ధానిక పంజా సెంటర్ నుండి సమస్యాత్మక ప్రాంతాల గుండా గొల్లపాలెం గట్టు వరకు మార్చ్ సాగింది. డీసీపీ హరికృష్ణ పర్యవేక్షణలో కవాతు నిర్వహించగా స్ధానిక పోలీసులు, కేంద్ర బలగాలు ఇందులో పాల్గొన్నాయి. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అధికారులు.
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఫెలోషిప్
నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం లభించింది. కష్టతరమైన శస్ర్తచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. చారిత్రక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో – RCPSG-UK ఆయనకు ఫెలోషిప్‌ను ప్రకటించింది. బీరప్పకు ఫెలోషిప్ రావడంపై ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు.
ఘోర రోడ్డు ప్రమాదం
నాగర్‌కర్నూల్ జిల్లా తాండ్ర సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతిచెందారు. జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న తుమ్మలపల్లికి చెందిన వెంకటేష్, జిల్లెళ్ల వాసి బోయ రాము మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


