35.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దు… కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి జూబ్లిహిల్స్‌లో పర్యటించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటీఆర్‌. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. అభ్యర్ధి పద్మారావుగౌడ్‌కు అత్యధిక మెజార్టీతో విజయం అందించాలని ఓటర్లను కోరారు. ప్రధాని మోడీ పాలనపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని హితవు పలికారు.

కార్పొరేటర్స్ ప్రెస్ మీట్

మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత నరేందర్‌ తీరుపై మండిపడ్డారు గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ కాంగ్రెస్‌ కార్పోరేటర్లు. అధికారంలో ఉన్నప్పుడు నరేందర్‌ చేసిన మోసాలు, అరాచకాలను మీడియాకు వివరిం చారు. తమపై అక్రమ కేసులు పెట్టిన ఘనత నరేంద్ర దన్నారు కార్పోరేటర్‌ గుండేటి నరేంద్ర కుమార్‌.

నితీష్‌ వ్యాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తెలంగాణలో ఎన్నికల పరిస్థితిని సమీక్షించింది భారత ఎన్నికల సంఘం. ఢిల్లీలోని కమీషన్‌ ప్రధాన కార్యాలయం నుండి సీనియర్‌ డిప్యూటీ కమీషనర్‌ నితీష్‌ వ్యాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేసారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, R O లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

పెరిగిన ఓటర్ల సంఖ్య

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4కోట్ల 14లక్షల వెయ్యి 887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుత జాబితా మేరకు 5 లక్షల 94వేల 631మంది ఓటర్లు పెరిగారు. మూడు నెలల్లో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాజా లెక్కల ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్లు 7 లక్షల 18వేల 764మంది అధికంగా ఉన్నారు.

భద్రాద్రి హుండీ లెక్కింపు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. గత 35 రోజుల హుండీ ఆదాయ లెక్కింపు జరపగా… కోటి 31 లక్షల 84 వేల 181 రూపాయలు నగదు రూపంలో వచ్చింది. బంగారు, వెండి కలపి కేజీ నాలుగు వందల యాబై గ్రాములు వచ్చినట్లు అధికారులు తెలి పారు. విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో వచ్చాయి.

బ్యాంకులో జమకాని వారి ఇంటికే పెన్షన్

బ్యాంకుల్లో నగదు జమకాని లబ్దిదారులకు రేపటి నుండి ఇంటింటికీ పెన్షన్‌ పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. బ్యాంక్‌ ఖాతాలు మనుగడలేని కారణంగా 74వేల 399 మంది పెన్షన్‌దారులకు నగదు జమ కాలేదని గుర్తించారు అధికారులు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌

రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెల మూడు నుంచి 13వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల రుసుం చెల్లింపుకు ఈనెల 16 గడువు తేదీ. కాగా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లింపు గడువును ఈనెల నాలుగో తేదీ వరకు పొడిగించారు.

మందుబాబుల ఆగడాలు

హనుమకొండలోని హనుమాన్ నగర్ వాసులు మందు బాబుల ఆగడాలతో నానా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇండ్ల మధ్య ఏర్పాటు చేసిన రంజిత్ వైన్స్ దుకాణం వీరి ఆగడాలకు అడ్డాగా మారింది. ఇదే మిటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యార్థుల వీసీ స్లాట్లు

విద్యార్ధుల వీసా ఇంటర్వూ స్లాట్లను దశలవారీగా విడుదల చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల రెండో వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, కోల్‌కత్తా, చెన్నై, ముంబయి కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇందుకొరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హాకీ కెప్టెన్‌గా మిడ్‌ ఫీల్డర్‌ సలీమా

భారత మహిళల హాకీ కెప్టెన్‌గా మిడ్‌ ఫీల్డర్‌ సలీమా టెటె నియమితురాలైంది. F I H ప్రొ లీగ్‌ బెల్జియం, ఇంగ్లాండ్‌ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహిస్తారు. యువ క్రీడాకారిణులు, అనుభవజ్ఞులతో భారత్‌ జట్టు బలంగా ఉందన్నారు సలీమా. బెల్జియంలో ఈనెల 22న మ్యాచ్‌లు ఆరంభమై మే 26న ముగుస్తాయి.

టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న

భారత టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బొపన్న పేద వర్గాల చిన్నారులకు టెన్నిస్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరులోని ప్రపంచస్ధాయి వసతులతో కూడిన RBTA అకాడమీలో బోపన్న మార్గదర్శనంలో చిన్నారులకు శిక్షణ లభించనుంది. తొలుతగా అస్సాం నుండి 25 మంది చిన్నారుల్ని ఎంపికచేసారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతీ ఏటా చిన్నారులను శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు బోపన్న.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్