కోట్ల దంపతుల ఎన్నికల ప్రచారం
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కూటమి టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాశరెడ్డి దంపతులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. బేతంచెర్ల మండలం బుగ్గనపల్లె తండా, సిమెంట్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలసి మద్దతు కోరారు. వైసీపీ అభ్యర్ధి రాజారెడ్డి వలే వ్యాపారాలు తమకు తెలియ వన్న కోట్ల దంపతులు ప్రజలకు మరోమారు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
బోడె ప్రసాద్ ఎన్నికల ప్రచారం
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు లబ్దిచేకూరేలా కూటమి మేనిఫెస్టో ఉందన్నారు పెనమలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి బోడె ప్రసాద్. ఉయ్యూరు మండలం కలాపాముల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన బోడె ఐదేళ్ల వైసీపీ పాలనపై మండిపడ్డారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలుచేయడంతో చంద్రబాబు ముందుంటారని గుర్తు చేసారు. విజయాన్ని అందించాలని కోరారు.
వివేక్ పై ధ్వజమెత్తిన గోమాస
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌పై ధ్వజమెత్తారు పెద్దపల్లి బీజేసీ ఎంపి అభ్యర్ధి గోమాస శ్రీనివాస్. పెద్దపల్లిలో వివేక్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో పర్యటించిన ఆయన అక్రమ ఆస్తులను కాపాడుకోవడంలో వివేక్‌కు ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ప్రచారం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారాన్ని చేపట్టారు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి నివేదిత సాయన్న. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, పాండు యాదవ్‌తో కలిసి ఆనంద్ నగర్, భవానీ నగర్, లక్ష్మీకాలనీ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలిసారు. కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఉగాది పురస్కారం
హైదరాబాద్‌లో వంశీ, తిరుమల బ్యాంక్ ఆధ్వర్యంలో మీడియా రంగంలో విశేష కృషి చేసిన వారికి ఉగాది కామధేను పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర న్యూస్ యాంకర్ శ్రీదేవి… నటుడు సుమన్ చేతుల మీదుగా ఉగాది కామదేను పురస్కరాన్ని అందుకున్నారు. తిరుమల బ్యాంక్, వంశీ ఇంటర్నేషనల్ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గోవింద నామాలతో వీఐపీ దర్శనం
బెంగళూరుకు చెందిన ఇంటర్ విద్యార్ధిని కీర్తన పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు గోవింద నామాలు రాసింది. గోవింద కోటి పథకం కింద తొలిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొందింది. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకున్న కీర్తన గోవింద నామాలు రాసిన పుస్తకాన్ని టీటీడీకి అందజేసింది. గోవిందకోటి రాసే అవకాశం కలగడం పూర్త జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొంది కీర్తన.
టీడీపీ నుండి వైసీపీలోకి ముప్పై కుటుంబాలు చేరిక
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ సానుభూతిపరులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి వీరికి సాదరంగా స్వాగతం పార్టీ కండువా కప్పారు. స్ధానికేతరులకు టికెట్ కేటాయించం వల్లే టీడీపీని వీడాల్సి వచ్చిందన్నారు వలస నేతలు.
ఓటు వినియోగదారులకు అభిబస్ ఆఫర్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి అభిబస్ బస్సు టికెట్ల బుకింగ్‌లో ఆఫర్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి 15 తేదీల మధ్య ప్రయాణాలకు కూపన్ కోడ్ ‘అభిఓట్’ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా 250 రూపాయల వరకు రాయితీ పొందవచ్చని పేర్కొంది.
వ్యాక్సిన్ పై క్లినికల్ పరీక్షలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాపై క్లినికల్ పరీక్షల్లో సాను కూల ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ – BE ఈ కీలక మైలురాయిని చేరుకుంది. న్యుబెవ్యాక్స్-14 అనే న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్‌పై మూడు దశ క్లినికల్ పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు లభించినట్లు సంస్థ వెల్లడించింది.
పోలీస్ కవాతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో పోలీసులు, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిం చారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. డయల్ 100 పనితీరును పాటల రూపాంలో వినిపిస్తూ… సాగిన మార్చ్ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
గంజాయి దొంగల అరెస్ట్
గంజాయిని దొంగిలించిన ఆరుగురు వ్యక్తుల్ని ఆరెస్టు చేసారు జగిత్యాల పోలీసులు. అరెస్టైన వారిలో అల్లెపు యశ్వంత్, అన్నవేని గంగాధర్, ధర్మారపు అశోక్, బోదాసు రాకేష్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ మీడియాకు వివరించారు. వీరి నుండి సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
బడి బంద్
అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్నంగా ఆలోచించారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వార్ని ప్రోత్సహించేలా బడ్డీ ఓటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిసారి ఓటు వేసే వారికి తోడుగా ఉంటామని, ఓటు వేయాలని చెబుతూ సీనియర్లు కట్టేదే ఈ బడ్డీ బ్యాండ్ అని కీర్తి వెల్లడించారు. ఈనెల 7న ఈ జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.


