34.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

చిలుకూరు బాలాజీ రథోత్సవం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో రథోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. వీసా దేవుడిగా పేరొందిన స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రధోత్సవం చేపట్టారు. హైదరాబాద్‌ నగరంతోపాటు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగాయి.

మాధవి రెడ్డి నామినేషన్ దాఖలు

కడప నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. ఆలయం వద్దకు చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డికి ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు.

మాజీ కార్పోరేటర్‌ ర్యాలీ

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి దానం నాగేందర్‌కు మద్దతుగా జీపు ర్యాలీ చేపట్టారు. గన్‌ ఫౌండ్రీ మాజీ కార్పోరేటర్‌ మమత సంతోష్‌ గుప్తా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. జీపులు, ద్విచక్ర వాహనాలతో యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దానం నాగేందర్‌ నామినేషన్‌ కార్యక్రమం, కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న నేపధ్యంలో ఈ ర్యాలీ జరిగింది.

ఓయు 2 కె రన్

    ఉస్మానియా యూనివర్సిటీలో తక్ష్ పేరుతో ఫౌండేషన్ డే ను మూడు రోజులు నిర్వహిస్తున్నట్లు వీసి ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. తొలిరోజు ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల పైలాన్ వరకు 2K రన్‌, రెండో రోజు ఓపెన్ డే గా డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. మూడో రోజు ఏప్రిల్ 26న ఫౌండేషన్ డే నిర్వహిస్తామని నీతి అయోగ్ మెంబర్‌ సరస్వతితో గెస్ట్ లెక్చర్ ఉంటోందన్నారు. తక్ష్ అనగా కొత్త ఆవిష్కరణలకు వేదిక అన్నారు రవీందర్‌.

పోలీసులు ప్లాగ్‌ మార్చ్‌

విజయవాడ వన్ టౌన్ లో పోలీసులు ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. రధం సెంటర్‌ నుండి బయలుదేరిన ఈ మార్చ్‌ ఇస్లాంపేట వరకు సాగింది. పారా మిలటరీ సిబ్బందితో పాటు స్ధానిక పోలీసులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ముందుకు వచ్చి ఓటును వినియోగించుకోవాలన్నారు విజయవాడ వెస్ట్‌ ACP మురళీకృష్ణ.

మెట్రో సేవలు పొడగింపు

ఉప్పల్‌ వేదికగా ఈనెల 25న జరగనున్న IPL మ్యాచ్‌ నేపధ్యంలో హైద్రాబాద్‌ మెట్రో తన సేవల్ని పొడిగిం చింది. మ్యాచ్‌ రోజైన రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు కొనసాగుతాయి. రాత్రి 12.15గంటలకు చివర ట్రైన్‌ ప్రారంభమై 1.10 గంటలకు గమ్యస్ధానం చేరుకుంటుంది. ఉప్పల్‌ స్టేడియం, NGRI స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతి.

రైల్వే అధికారులు తెచ్చిన కొత్త పథకం

ఎకానమీ మీల్స్‌ ఫర్‌ జనరల్‌ కోచ్ ప్యాసింజర్‌ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఐఆర్‌సీటీసీతో కలసి ఈ పథకాన్ని తొలుతగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఎకానమీ మీల్స్‌ ప్యాకెట్‌ ధర 20 రూపాయలు కాగా, స్నాక్స్‌ మీల్స్‌ 50 రూపాయలకి అందిస్తున్నారు.

తేలికగా ఉండే బులెట్ ప్రూఫ్ జాకెట్

అత్యంత తేలిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ సిద్దమైంది. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ – DRDO దీన్ని అభివృద్ధి చేసింది. హైయెస్ట్‌ ధ్రెట్‌ లెవెల్‌-6 లోనూ ఇది రక్షణ కల్పిస్తోంది. ఈ విషయాన్ని డీఆర్‌డీఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీని తయారీకి ప్రత్యేక మెటీరియల్‌ను వినియోగిం చడమే కాకుండా కొత్త పద్దతిని అనుసరించినట్లు పేర్కొంది.

రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ చెకోపోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరీష అనే మహిళ మృతి చెందిం ది. సోదరుడి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు వెనుక భాగం తగిలి కింద పడింది. తీవ్రంగా గాయ పడ్డ శిరీషకు చికిత్స అందించేలోపే మృతి చెందింది. మెట్రో పిల్లర్ నంబర్ 1539 వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఐపీ మ్యాచ్

ఈనెల 25న హైదరాబాద్‌, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం సన్నద్ధమైంది. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. విజయాలతో దూసుకుపోతున్న SRH జట్టులోకి అఫ్ఘనిస్తాన్ ప్లేయర్‌ ఫజల్‌ హక్‌ ఫరూఖీ అందుబాటులోకి రానున్నాడు. అఫ్ఘనిస్తాన్‌ బోర్డ్‌ NOC మంజూరు చేసింది. బెంగళూరుతో తలపడే మ్యాచ్‌లో SRH తుదిజట్టులో ఫరూఖీకి ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్