25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఈనెల 20 కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

ఈనెల 20న నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారని..టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారన్నారు. అనంతరం కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని కేడర్‌కు శ్రీకాంత్ పిలుపునిచ్చారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం అభ్యర్థిగా పావని తొలి నామినేషన్

కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వక్కలగడ్డ పావని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సత్యమేవ జయతే నినాదంతో..ప్రజలకు తనవంతు చేయూతను అందించేం దుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పావని చెప్పారు.

చిత్తూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు నామినేషన్

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో సాధారణంగా వచ్చి ఆయన జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ షన్మోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. బీజేపీతో పొత్తు వల్ల ఏపీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామ న్నారు.

తెలంగాణలో నామినేషన్ల పర్వం

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది.. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన భార్య జమున శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి చెంత నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. మల్కాజిగిరిలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. మాల్కాజిగిరి అభివృద్ధి కోసం అందరూ బీజేపీకి ఓటేయాలని కోరారు.

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు లేఖ

మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్ళకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప, ఆయన అల్లుడు కలసి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సిర్పూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పేరుతో పాటు తమ పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో ఆక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

బాలాజీనగర్ కాలనీవాసులు ఆందోళన

హైదరాబాద్‌ బాలాజీనగర్‌ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు రాంపులను కాంట్రాక్టర్లు అక్రమంగా కూల్చివేశారని వారు వాపోయారు. కాంట్రాక్టర్లు కొంత మంది కాలనీవాసులతో కుమ్మక్కై కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ కు, విజిలెన్స్ అధికారులకు కూడా కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేస్తామని కాలనీవాసులు తెలియజేశారు. అయితే స్థానిక బిజెపి కార్పొరేటర్ కలగజేసుకొని వెంటనే తమ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనలు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తొలి విడత నామినేషన్‌ పత్రాలు అందజేశారు. త్వరలో అట్టహాసంగా రెండో విడత నామినేషన్ కార్యక్రమం ఉండనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు.

తిరుపలి జిల్లా సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా రాజేష్ నామినేషన్

తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన తరుఫున భార్య చైతన్య భాను నామినేషన్ దాఖలు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ జండా ఎగరడం ఖాయమన్నారు ఆమె. 23న వైసీపీ శ్రేణులతో కలిసి రాజేష్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేయనున్నారన్నారు.

ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం

       ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసు కుంది. యాబాజిగూడకు చెందిన రాజ్‌కుమార్, ఖుదావన్ పూర్‌కు చెందిన యువతి మధ్య గత ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు మరో యువతితో నిశ్చితార్థం జరిపించారు. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి పోలీసుకు ఫిర్యాదు చేసింది. యువకుడిని వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడే క్రమంలో..హఠాత్తుగా తన వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు రాజ్‌కుమార్.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్