ఉగాది సందడి
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడా యి. నూతన ఏడాది పంచాంగ శ్రవాణాన్ని ఆలకించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. స్వామివారి సన్నిధిలో పూజాదికాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అమ్మవారి సన్నిధిలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల తో స్వాగతం పలికిన అధికారులు రోజాకు దర్శన ఏర్పాట్లు చేసారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా తన కుమారిడితో కలసి అమ్మవార్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రోజా.
ఇసుక దందా
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇసుక అక్రమ రవాణాను స్ధానిక యువత అడ్డుకుంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ ఇసుక దందా యధేచ్చగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ దందాపై అధికారులకు ఫిర్యాదులిచ్చిన ఫలితం లేదు. దీంతోయువత ముందుకొచ్చి అక్రమ రవాణాను అడ్డుకుంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏడు ఇసుక ట్రాక్టర్లను, ఒక జేసీబీని సీజ్ చేసారు.
నూతన యాప్
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్ద – TSSPDCL తన అధికారిక యాప్‌లో పలు మార్పులు చేస్తూ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో నూతనంగా బిల్ పేమెంట్స్, బిల్ హిస్టరీతోపాటు మరిన్ని సేవల్ని పొందుపర్చింది. వినియోగదారులు తమ సమస్యలను ఫిర్యాదుచేయడానికి పవర్ ఓల్టేజ్, మీటరు, బిల్లింగ్ సమస్యలతోపాటు పలు ఆప్షన్స్ నూతన యాప్‌లో ఉన్నాయి.
స్పెషల్ మెడల్
గత ఏడాది వన్డే వరల్ఢ్ కప్‌లో టీమ్ ఇండియా అనుసరించిన విధానాన్ని ముంబై ఇండియన్స్ నమ్ము కుంది. వన్డే వరల్డ్ కప్ తరహాలో ఈ ఐపీఎల్ పోరులో ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు స్పెషల్ మెడల్‌ను ముంబై యాజమాన్యం ఇస్తోంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌కు ఈ మెడల్ దక్కనుంది. ఢిల్లీ – ముంబై మ్యాచ్‌లో క్రికెటర్ రోహత్ శర్మకు ఈ మెడల్ దక్కింది.


