సప్తగిరుల సంకీర్తనలు
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలతో తిరుమల గిరులు పులకించాయి. అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊంజల్ సేవలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీమాన్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అహోబిలం శ్రీ నరసింహస్వామి అనుగ్రహంతో దీక్ష పొంది 32 బీజాక్షరాలతో 32 వేల సంకీర్తనలు అన్నమయ్య రచించా రని గుర్తు చేసారు.
మహానంది క్షేత్రంలో….
ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయంకు విచ్చే సిన భువనేశ్వ రికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు అభిషే కాలు, కుంకుమార్చన నిర్వహిం చి మొక్కులు చెల్లించుకున్నఅనంతరం భువనేశ్వరికి వేద పండి తులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
ఎలా నిర్ధారిస్తారు…?
వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి హంతకుడని నిర్ధారించడం కోర్టును అవమానపర్చడ మేనన్నారు ఎమ్మెల్యే సుధా. కడప జిల్లా బద్వేల్‌లో వైఎస్ షర్మిల అవినాష్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిం చారు. వివేకా హత్యపై అందరం చింతిస్తున్నామన్న సుధా హత్య చేసిన వారు అ్రపూవల్‌గా మారిన విషయం తెలిసిందేనన్నారు.
ఉక్కుపాదం …
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చివేశారు. ఈ షెడ్డు మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డిదిగా గుర్తించారు.
17న బంజారా మహాసభ
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల్ కందనెల్లి తండా సమీపంలో భారత్ బంజారా ధర్మరక్షణ జాగృతి సందేశ్ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక కేంద్ర నిర్వాహకులు రమావత్ శాంతాదేవి తెలిపా రు. శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 17న జరిగే ఈ మహాసభకు బంజారా సోదరులు, ఆధ్యా త్మిక భక్తిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
భవనంకు తుదిమెరుగులు
పిఠాపురం శాసనసభ స్ధానం నుంచి బరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఇందుకొరకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన నివాసం ఉండబోయే భవనం ముస్తాబవు తోంది. తుదిమెరుగులు దిద్దుకుంటోంది. పార్టీ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ఇక్కడనుంచే నిర్వహించేం దుకు వీలుగా ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి.
అభరణాలు చోరీ
జగిత్యాల ఆర్టీసి బస్టాండ్ లో బస్సు కొరకు వేచి ఉన్న ప్రయాణీకురాలి బ్యాగ్ నుంచి 15 తులాల బంగారం అభరణాలు చోరీకి గురయ్యాయి. మెట్‌పల్లి బస్సుకోసం నిరీక్షిస్తున్న వెల్లుల్ల రోడ్ కి చెందిన సురిగి మంగరాణి ఒక శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఈ చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
బోటు ప్రమాదం
విశాఖ సముద్రంలో మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురైంది. బోటులోని సిలిండర్ పేలడంతో 9 మంది మత్స్యకారు లు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షక దళం క్షతగాత్రుల్ని చికిత్సకై కేజీహెచ్ కు తరలించింది. గాయపడ్డ మత్స్యకారుల్ని కాకినాడ జగన్నాధ్ స్వామి బ్రిడ్జి సమీప వాసులుగా గుర్తించారు.
అగ్ని ప్రమాదం
వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి కళాశాల వద్ద ఉన్న జేపీ దావత్ దాబాలో అగ్ని ప్రమాదం సంభవిం చింది. కిచెన్ గదిలో చెలరేగిన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సకాలంలో చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపుచేయ డంతో పెను ప్రమాదం తప్పింది.
కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ పోలీసులు కర్ణాటక రాష్ట్రంకు చెందిన మద్యంను పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఈ మద్యం పట్టుబడింది. రవాణాకు వినియోగిస్తున్న మారుతి సుజుకి వాహ నంతోపాటు మూడు వేల 168 టెట్రా ప్యాకెట్లు, కర్ణాటక మద్యంను స్వాధీనపర్చుకున్నారు. కడగందొడ్డి గ్రామానికి చెందిన హరీష్‌గౌడ్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు పట్టుబడ్డ మద్యం విలువ రెండు లక్షలు రూపాయలు ఉంటుందన్నారు.
రూ.204 కోట్ల బిల్లులు ఆదా
ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లను ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది మంచి పురోగతి సాధించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో 148 త్రీఫేజ్ ఎలక్ట్రిక్ ఇంజన్లను వినియోగంలోకి తెచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 46 జతల ప్రయాణీకుల రైళ్లను డీజిల్ నుంచి ఎలక్ట్రిక్‌కు మార్చిన ఫలితంగా రైల్వే శాఖకు ఏడాదికి 204 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఆంక్షలు తొలగింపు
ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ మాల్దీవులకు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను భారత్ తొలగిం చింది. బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, గోధుమపిండి తదితర వస్తువులను నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేసేందుకు సిద్దమైంది. వీటితోపాటు 42.75 కోట్ల కోడిగుడ్లు ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. మాల్దీవుల నూతన అధ్యక్షుడు భారత పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న భారత్ మాత్రం ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూనే ఉంది.
భాగస్వామ్య ఒప్పందం
భారత్‌లో వెరిసిగ్వాట్ అనే బ్రాండ్ ఔషదాన్ని విక్రయించడానికి బేయర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ భాగ స్వామ్య ఒప్పం దం చేసుకున్నాయి. గుండె వైఫల్యంతో చోటుచేసుకునే మరణాలను అదుపు చేయడానికి ఈ మందును సిఫార్స్ చేస్తారు. ఏటా కోటి మంది వరకు భారత్‌లో గుండె వైఫల్యంతో ప్రాణాలు కోల్పోతు న్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కాగా వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఈ వెరిసిగ్వాట్ మందు సత్ఫలితాలు ఇస్తోందంటున్నారు బేయర్ జైడస్ ఫార్మా ఎండీ శ్వేతా రాయ్.