29 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పట్టుబడ్డ నగదు

ఆసిఫాబాద్ జిల్లా ఉషేగామ్‌లో సీఐ అంజయ్య, ఆయన సిబ్బంది 7 లక్షల 31 వేల 350 రూపాయలు పట్టుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడింది. ఉట్నూ ర్ నుండి జైనూర్ వెళ్లే ఆర్టీసీ బస్సులో గరికముక్కు విజయకుమార్ తీసుకెళ్తున్న ఆధారాలు లేని నగదు ను సీజ్‌ చేశారు.

లంచగొండి పట్టివేత

ప్రకాశం జిల్లాలో అవినీతి జలగ ఏసీబీ వలకు చిక్కింది. యాక్సిడెంట్‌ కేసులో బాధితుడిని 70 వేలు లంచం డిమాండ్ చేసిన టంగుటూరు ఎస్‌ఐ నాగేశ్వరరావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధి తుడు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారుల వల పన్ని నాగేశ్వరరావు ను పట్టుకున్నారు.

తప్పిన ప్రమాదం

కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లిలో కడప- చెన్నై నేషనల్ హైవేపై భాకరాపేటలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి వైపు నుండి కడప వెళ్తున్న వాహనంపై చెట్టు పడింది. ఆ సమయంలో అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

గొంతుకోసిన కసాయి కొడుకు

కన్నతల్లి గొంతు కోసి చంపాడు వృద్ధురాలి రెండో కొడుకు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండ లం అడవికొడియంబేడులో జరిగింది. 80 ఏళ్ల రాజమ్మతో గొడవపడిన ఆమె రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు గొంతు కోసి చంపి పరారైనట్లు తెలుస్తోంది. భూమిని పెద్దకొడుకు కుమారుడికి రాసి నందుకు కృష్ణారెడ్డి దారుణానికి తెగించాడు.

కారు బీభత్సం

ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాకలో కారు బీభత్సం సృష్టించింది. ఆకివీడు నుండి కైకలూరు వస్తున్న కారు ఆటో, రెండు బైక్‌లను ఢీకొని ఎదురుగా ఉన్న టెంట్‌హౌస్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలు తగిలాయి. గాయపడ్డవారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చేనేత కార్మికుల ఆవేదన

చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కులాల ఐక్యవేదిక సంఘం కన్వీనర్ శంకరపు జయశ్రీ డిమాండ్‌ చేశారు. అతలాకుతలం అయిన చేనేత పరిశ్రమను పరిర క్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేపై పార్థసారధి విమర్శ

వైపీనీ పాలనను విమర్శించిన వారిపై దాడులు చేయటం ఆ పార్టీకి కొత్తేమీ కాదని ఏలూరు జిల్లా నూజివీ డు ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి ఎదురు దాడి చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావులా అటవీ భూములు ఆక్రమించి, కొందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించిన చరిత్ర తనకు లేదన్నారు పార్థసారథి.

నక్సలైట్ల అరెస్ట్

బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ నక్సలైట్లను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్ట్ కమాండర్ దేవన్న పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఎన్ ఎస్ ఆర్ గ్రూప్ వారికి, హజార హాస్పిటల్, దీపక్ స్కిన్ క్లినిక్ హాస్పటల్ కు లెటర్ ఇచ్చి పాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు.

జనసేనలో చేరిన నాయీ బ్రాహ్మణులు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి… జనసేనలో చేరామని నాయీ బ్రాహ్మణుల సంఘ కార్యదర్శి బుచ్చిబాబు. తిరుపతిలో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో 200 మందికి పైగా నాయీ బ్రాహ్మణులు జనసేనలో చేరారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులం నాయీ బ్రాహ్మణులు అన్నారు బుచ్చిబాబు.

సీఎస్ శాంతికుమారి రివ్యూ

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన 6వ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొత్త టెలికాం మౌలిక సదుపాయాల విస్తరణ కల్పనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 108.19 శాతం టెలిడెన్సిటీతో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

గెలుపే లక్ష్యంగా రంజిత్ రెడ్డి

చేవెళ్ల లోక్‌సభా స్థానం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అభ్యర్థి రంజిత్‌రెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో తనకు మంచి మెజార్టీతో గెలిపించిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. గెలిపించిన వెంటనే బీజాపూర్‌ హైవేని నిర్మాణం చేపడతానని ఎంపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్