39.2 C
Hyderabad
Monday, April 15, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

సుజనా చౌదరిపై కేశినేని నాని ఫైర్

ఫ్లైట్స్‌లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వైసీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్డులు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముస్లీంలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబో తున్నారని విమర్శించారు.

అవనిగడ్డ అధ్వాన్నంగా మారింది-బుద్ధ ప్రసాద్

అవనిగడ్డ అధ్వాన్నంగా మారిందని మండలి బుద్ద ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను తప్ప కుండా గెలిపిస్తారని నమ్ము తున్నానని… సహకారంతో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల కోసం పనిచేస్తానని తెలి పారు. ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని… ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపుని చ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి

తిరుమల శ్రీవారిని అహోబిలం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్ దర్శించుకున్నారు. ఆల య మహా ద్వారం వద్దకు చేరుకున్న యతీంద్ర స్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్క రించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపల స్వామీజీ మాట్లాడుతూ అహో బిల దేవస్థానంకు మఠం తరపునే ఆభరణాలు చేయించాము తప్ప దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్దిక సాయం పొందలేదన్నారు..గుప్తనిధులు కోసం తవ్వకాలు జరగలేదని స్పష్టం చేసారు.

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో గంజాయి కలకలం

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో గంజాయి కలకలం రేపింది. ఓ కిరాణా షాపులో గంజాయి విక్రయిస్తున్న మహిళను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అనురాధ బాయి అనే మహిళ ధూల్‌పేట్‌ నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, 1200 రూపాయాల నగదు, సెల్‌ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

మోండా మార్కెట్‌లో ఎమ్మెల్యే తలసాని పర్యటన

చిరు వ్యాపారుల పట్ల పోలీసు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌, బండిమెట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గత 40 ఏళ్లుగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారన్నారు. పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.

సీఎం జగన్‌పై టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం

  సీఎం జగన్‌పై టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ సీఎం కుర్చీ కోసం ఎంతకైనా దిగజారి పోతున్నారని విమర్శించారు. పింఛన్ దారులకు ఇంటికెళ్లి ఇవ్వాల్సిన పెన్షన్ ..సచివాలయాల దగ్గర ఇచ్చే నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. మండుటెండలో వృద్ధులు ఎలా రాగలని నిలదీశారు. జగన్ కుటిల రాజకీయాలకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల బలి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం

    టీడీపీపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఫైర్ అయ్యారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఆ పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వాలంటీర్లకు దూరం చేసి పింఛన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు వాలంటీర్లను భయపెడుతున్నారని విమర్శించారు.

మూడో రోజు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మూడో రోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పిఠాపు రంలో గోకుల్ గ్రాండ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతోనూ సమావేశయ్యారు. ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవన్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ద ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలోకి చేరారు. వారికి పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అవనిగడ్డ, పాలకొండ సీట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయింది.

 

Latest Articles

ముగిసిన సీబీఐ కస్టడీ ….కవితను కలిసిన కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను మూడు రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్