Trafic restrictions | తెలంగాణకే తలమానికం, మరో మణిహారం, నూతన సచివాలయం ఆదివారం ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించమని వెల్లడించారు.
సెక్రటేరియట్ ప్రారంభం దృష్ట్యా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ ను మూసివేయనున్నారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్.టి.ఆర్ మార్గం, తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతిస్తామని పేర్కొన్నారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు.. చింతల్ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతించనున్నారు.