27.7 C
Hyderabad
Friday, March 21, 2025
spot_img

‘జాక్’లో నవ్విస్తూనే బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తాను: సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కిస్ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ గురువారం రోజున విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో

పాటల రచయిత సనారె మాట్లాడుతూ ‘‘శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో పాట రాయటం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలిగారికి, నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, పాటను పాడిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘‘నాకు ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ గారికి థాంక్స్. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్ తో ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది. నిర్మాతలు బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి థాంక్స్’’ అన్నారు.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘సిద్ధు యూత్‌లోనే కాదు.. అన్నీ ఏజ్‌ల వారికి స్టార్ బాయ్‌గా మారారు. ‘జాక్’ సినిమాను భాస్కర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘‘ఇంత మంచి పాటను రాసిన సనారెకి థాంక్స్. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా పాటను రాశారు. ఇంత మంచి ట్యూన్ ను అందించిన సురేష్ గారికి. డైరెక్టర్ భాస్కర్ గారికి థాంక్స్. ఏప్రిల్ 10న మా జాక్ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. మీకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘మూవీకి ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే టైటిల్ పెట్టటానికి కారణం.. రైమింగ్ తో పాటు హీరో క్యారక్టరైజేషన్. సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి మనిషి లైఫ్ లో ఓ గోల్ ఉంటుంది. అయితే ఏ పని చేస్తున్నామనే దాంతో పాటు ఆ పనిని మనం ఎలా చేస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓ పనిని ఇలానే ఎందుకు చేయాలి.. మరోలా నేను చేస్తానని కొందరు అంటుంటారు. అలాంటి వాడిని చూస్తే మనం క్రాక్ అంటుంటాం. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. హీరో క్యారెక్టరైజేషన్ గురించి భాస్కర్ గారు చెప్పగానే నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.  నేను కూడా రైటర్‌ని కాబట్టి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను.. దాన్ని భాస్కర్‌గారు ఆయన కథకు అనుగుణంగా డెవలప్ చేశారు. ప్రేక్షకులను నవ్విస్తూనే రెస్పాన్సిబుల్‌తో ఉండే పాత్రలో కనిపిస్తాను. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

Latest Articles

‘మార్కో’ దర్శకుడితో దిల్ రాజు ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్