24.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

IIT-BHU: ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినికి అకతాయిల వేధింపులు…

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బెనారస్‌ హిందూ యూనివర్శిటీ (IIT-BHU ) క్యాంపస్‌లో దారుణం జరిగింది. బైక్‌ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా ముద్దు పెట్టడంతో పాటు బట్టలు విప్పించి వీడియో(Video) తీసి వేధించారు(Harassment). ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు.

బెనారస్‌ హిందూ యూనివర్సిటీ(IIT-BHU) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై కొందరు ఆకతాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు విద్యార్థినిని వేధించడం(Harassment)తో పాటు బట్టలు విప్పించి, వీడియోలు చిత్రీకరించారు. ఐఐటీ- బీహెచ్‌యూలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారణాసి(Varanasi)లోని ఐఐటీ-బీహెచ్‌యూ గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

 

వారణాసి(Varanasi)లోని ఐఐటీ-బీహెచ్‌యూ(IIT-BHU)కి చెందిన విద్యార్ధిని బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హాస్టల్‌కు సమీపంలోని కర్మన్‌ బాబా ఆలయం(Karman Baba Temple) వద్దకు వెళ్లింది. అప్పుడే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. గురువారం తెల్లవారు జామున విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో క్యాంపస్‌(Campus)లోకి బైక్‌పై వచ్చిన ఆ ముగ్గురు ఆకతాయిలు విద్యార్ధిని వేధింపులకు(Harassment) గురి చేశారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని, స్నేహితులతో వెళ్తున్న తనను వారి నుంచి వేరు పరచి ఓ చోటుకు తీసుకెళ్లారు. 

ఆ తర్వాత వారు ఆమెను వివస్త్రను చేసి, వీడియోలు, ఫోటోలు తీశారని విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు(complaint)లో పేర్కొంది. 15 నిమిషాల తర్వాత నిందితులు ఆమె ఫోన్ నంబర్ తీసుకుని, విడిచిపెట్టారని ఫిర్యాదులో వెల్లడించింది. విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354(IPC Section 354) ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా మహిళపై దాడి చేసి, అవమానపరచడం వంటి పలు నేరాల కింద ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

మరో వైపు ఈ ఘటనతో ఐఐటీ-బీహెచ్‌యూ(IIT-BHU) అట్టుడికిపోయింది.యువతికి వేధింపుల ఘటన గురించి తెలియడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బీహెచ్‌యూ విద్యార్థులు క్యాంపస్‌లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(Activity Center) వద్ద గుమిగూడి నిరసన తెలిపారు. ఓ బైకును కూడా తగులబెట్టారు. ముగ్గురు ఆకతాయిల చేతిలో ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని, బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌ను ఐఐటీ క్యాంపస్ నుంచి వేరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు(CCTV cameras), సజావుగా పనిచేయని ఎలక్ట్రిసిటీ(Electricity)పై విద్యార్థులు మెమోరాండం కూడా ఇచ్చారు. ఇక ఈ ఘటనపై విద్యార్థులతో కలిసి సామాజిక వేత్తలు, మానవతా వాదులు బాధితురాలికి సపోర్టుగా నిలుస్తున్నారు. 

సమాజంలో తిరుగుతున్న ఇలాంటి చీడ పరుగులను వెంటనే ఏరిపారేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై డీసీపీ ఆర్‌ఎస్ గౌతమ్(DCP RS Gautam) మాట్లాడుతూ.. నిందితులను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు గురైన విద్యార్థిని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ(DCP) మీడియాకు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్