స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో అన్ని కులవృత్తులను కాపాడుకుంటూ అన్నిరంగాలను అభివృద్ధి చేసేందుకు అనుక్షణం సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud)చెప్పారు. ఇక్కడ ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.100 కోట్ల అమ్ముడుపోవడం వెనక రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ (Excise Police station)కొత్త భవనానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో (Mla Sudeer Reddy) కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆనాటి ప్రభుత్వాలు ఆదాయం వచ్చే శాఖలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదని చెప్పారు. డొక్కు బండ్లతో కాలం చెల్లిన వాహనాలను నడిపిస్తూ ఎక్సైజ్ శాఖను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖ్, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, అధికారులు రవీందర్, లక్ష్మణ్ గౌడ్, సరళ పాల్గొన్నారు.