ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై హీరో వెంకటేశ్ స్పందించారు. దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదని అన్నారు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో దిల్ రాజు ఇంట్లోనే కాదు చాలా మంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నామని తాము అంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ అధికారులు వచ్చారని అన్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమైపోయిందని చెప్పారు. తాను సుకుమార్ ఇంటి పక్కన ఉండడం లేదని.., ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కన ఇంట్లోకి వెళ్తున్నామన్నారు. తన ఇంటిపై ఐటీ దాడులు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.