26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్: రాహుల్‌గాంధీ

Rahul Gandhi |దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తనపై అనర్హత వేటు వేసినంత మాత్రాన ప్రశ్నలు అడగడం మానేయబోనని అన్నారు. అనర్హత వేటుకు తాను భయపడనని.. అరెస్టు చేసినా తాను వెనకడుగు వేయబోనని అన్నారు. అదాని షెల్ కంపెనీలలో రూ.20వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారు? అంటూ ప్రశ్నించారు. ‘అదానీ- మోదీ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. మోదీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఉంది. దానికి చాలా రుజువులు ఉన్నాయి. దీనికి సంబంధించి నేను పార్లమెంట్​లోనూ మాట్లాడా. కానీ నా ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించారు’ అని అన్నారు.

Rahul Gandhi వ్యాఖ్యలు:

👉🏻నిబంధనలు మార్చి ఎయిర్‌పోర్టులు అదానికి ఇచ్చారు.
👉🏻నేను విదేశీ శక్తుల నుంచి సహకారం కోరానని కేంద్రమంత్రులు పార్లమెంట్‌లో అబద్ధం చెప్పారు.
👉🏻నేను రెండు లేఖలు రాస్తే వాటికి జవాబు లేదు.. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు.
👉🏻నేను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతాను.. నేను ఎవరికి భయపడను.
👉🏻నాపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా తగ్గేది లేదు.
👉🏻ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోంది.. నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్.
👉🏻ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం.
👉🏻ప్రజల్లోనే ఉంటాను, ఇప్పటికే భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లాను.
👉🏻ఈ దేశం నాకు ప్రేమ, మర్యాద, ఇంకెంతో ఇచ్చింది.. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే.
👉🏻న్యాయవ్యవస్థను గౌరవిస్తా, జైలు శిక్షపై ఏం మాట్లాడను.. నా తరువాతి ప్రసంగానికి భయపడే ప్రధాని నాపై అనర్హత వేటు వేశారు.
👉🏻బీజేపీ నేతలంతా మోడీ అంటే భయపడతారు.. నా ప్రశ్నంతా రూ.20వేల కోట్లు ఎక్కడివి అని మాత్రమే.
👉🏻నాకు మద్దతుగా మాట్లాడిన విపక్షాలకు ధన్యవాదాలు.
👉🏻క్షమాపణ కోరడానికి నేను సావర్కర్ కాదు.. నా పేరులో గాంధీ ఉంది, గాంధీ ఎవరి క్షమాపణ కోరరు.
👉🏻విదేశాల్లో మాట్లాడిన మాటల గురించి పార్లమెంట్‌లో మట్లాడే అవకాశం ఇవ్వమని కోరా.. నన్ను జైల్లో పెట్టినా సరే, నా పని నేను చేస్తాను.
👉🏻అదాని ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది.
👉🏻అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారు.
👉🏻అదాని గురించి ప్రశ్నిస్తే, దేశంపై దాడి అంటున్నారు.. అంటే అదానియే దేశమని ప్రధాని చెబుతున్నారా?

Read Also:  కర్ణాటకలో గెలుపు కోసం కాంగ్రెస్ పక్కా ప్లాన్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్