రెండు రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్య టించనున్నారు. ఉదయం కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజల నుంచి విన తులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రాజుపేట దగ్గర హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్నా రు చంద్రబాబు. రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపటి నుంచి ఎన్నికల ప్రచారప ర్వంలోకి దిగనున్నారు చంద్రాబబు. రేపటి నుంచి ప్రజాగళం పేరుతో సభలు, రోడ్‌షోలు నిర్వహి స్తారు. రేపు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతి రోజు 4 నియోజ కవర్గాల్లో నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.