21.2 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

అమెరికాలో భర్త మృతి తట్టుకోలేక హైద‌రాబాద్‌లో భార్య ఆత్మహత్య

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నేటి కాలంలో భార్యభర్తల మధ్య సఖ్యత అంతగా కానరావడం లేదు. ఏదో ఒక విషయంలో మనస్పర్థలతో గొడవలు పడుతున్నారు. కొంతమంది విడిపోతుంటే.. మరికొంతమంది బరితెగించి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ భార్య తన భర్తపై ప్రేమతో ఎవరూ చేయలేని పనిని చేసింది. హైదరాబాద్‌ అంబర్ పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితికి వనస్థలిపురానికి చెందిన మనోజ్‌తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఆ జంట అమెరికా వెళ్లిపోయి డల్లాస్‌లో ఉంటున్నారు. ఈనెల 2న తల్లిదండ్రులను చూసేందుకు సాహితి హైదరాబాద్‌కు వచ్చింది.

అయితే అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్‌‌‌ గుండెపోటుతో మరణించాడు. భర్త మరణవార్తను ఆమె తట్టుకోలేకపోయింది. ఈనెల 23న మనోజ్ మృతదేహం నగరానికి రావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయిన సాహితి రెండురోజులుగా ముభావంగా ఉండడంతో ఆమెకు తోడుగా చెల్లెలు ఉంటుంది. అయితే గురువారం ఉదయం పనిమీద చెల్లెలు బయటకు వెళ్లగానే సాహితి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక సాహితి కూడా బలవన్మరణం చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్