తిరుపతి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ స్కామ్ బయటపడింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అండతో సబ్ రిజిస్ట్రార్ శోభారాణి రెచ్చిపోయింది. స్టాంపులు అమ్మిన సొమ్మును లక్షల్లో కాజేసింది. నామ మాత్రపు విచారణతో ఈ విషయాన్ని ముగించడానికి కోటి రూపాయల డీల్ కూడా కుదిరినట్టు సమాచారం. అందుకు సంబంధించి వైసీపీ అనుకూల అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, జూనియర్ అసిస్టెంట్ షా బుద్ధీన్‌లపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వందల సంఖ్యలో వివాదాస్పద రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు సమాచారం. రెండేళ్లకు పైగా రోజువారీ కార్యాల య నగదు బ్యాంకులో జమ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా దోచేసిన సొమ్ముతో పై అధికారులను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.