27.2 C
Hyderabad
Wednesday, January 8, 2025
spot_img

వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భారీ ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈనెల 10 న వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం వుండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది. దీంతో పోలీసులు, టీటీడి భక్తుల భద్రతకు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మంగళవారం టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ఏర్పాట్లను పరిశిలించారు.

జనవరి 9 వ తేదీన అర్ధరాత్రి తరువాత జీయర్‌స్వాముల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది ఈసందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 10 వేకువ జామున నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్ మెంట్లలోకి అనుమతించేదుకు తిరుమల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. మంగళవారం చైర్మన్ బి ఆర్ నాయుడు ఏర్పాట్లను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ నెల 19 వ తేదీ అర్ధరాత్రి వరకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.

తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా చిన్న పాటి ఆటంకం ఏర్పడకుండా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు.10వ తేది శుక్రవారం కావడంతో స్వామివారికి జరగవలసిన కైంకర్యాలు జరిగిన తరువాత ఉదయం 4.45 నిమిషాలకు ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను అనుమతిస్తామని, తదుపరి 19 వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సర్వదర్శనం ఉంటుందని తిరుమల ఇవో ఒక ప్రకటనలో తెలిపారు

వైకుంఠ ద్వార రోజుల్లో సుమారు 7 లక్షల మంది స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉందని టిటిడి అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1.40 లక్షల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను డిసెంబరు 24న ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయగా,శ్రీవాణి దర్శనానికి డిసెంబర్ 23 వ తేదిన, జనవరి 1వ తేదీకి సంబంధించి 1500 టికెట్లను విడుదల చేయగా, మిగిలిన 9 రోజుల్లో రోజుకు 2000 టికెట్లను టిటిడి విడుదల చేసింది.

ఇక తిరుమల తిరుపతి స్థానికుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. సుమారు తొమ్మిది ప్రాంతాల్లో 91 కౌంటర్లకు పైగా స్థానికులకు టికెట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.అందులో ప్రధానంగా తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మొదటి మూడు రోజులు మాత్రమే ఈ తొమ్మిది కౌంటర్లో టికెట్లు కేటాయిస్తామని , తరువాత శ్రీనివాస, విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న కౌంటర్లలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను ఇస్తామని అధికారులు వెల్లడించారు.అందుకు సంబంధించి తోపులాట జరగకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టిటిడి వెల్లడించింది. టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావొచ్చని అయితే స్వామి దర్శనం కల్పించ లేమని టిటిడి స్పష్టం చేసింది.. అందుకు భక్తులు టిటిడి అధికారులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా భక్తులు తమకు కేటాయించిన నిర్దేశిత సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Latest Articles

Breaking: విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో విశాఖ నేవీలోని ఐఎన్‌ఎస్‌ డేగకి మోదీ రానున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్‌, సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఘన స్వాగతం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్