22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

చనిపోదామని అనుకున్నా: హృతిక్ రోషన్

ఎందుకో తెలుసా?

ప్రేక్షకులు సినిమాకి వెళ్లి రెండున్నర గంటలు ఏసీ థియేటర్ లో హాయిగా  కూర్చుని, ఇంటర్వెల్ కి ఏదొకటి తెచ్చుకుని చక్కగా తిని ఇంటికివెళ్లిపోతారు. కానీ ఆ సినిమా చేసిన హీరో మాత్రం, అంత హ్యాపీగా ఇంటికి వెళ్లడు.

ఎందుకంటే, ఆ సినిమాలో నటించడానికి, ఫైట్స్ చేయడానికి ఎంత కష్టపడ్డాడనేది  ఎవరికీ తెలీదు. షూటింగుల్లో టేకుల మీద టేకులు చేస్తూ, పక్కవాళ్ల పెర్ ఫెక్షన్ లేకపోతే మళ్లీ చేస్తూ, ఇంటికెళ్లాక అలసిసొలసి పడుకుండిపోతారు. ఒకొక్క సందర్భంలో చనిపోదామని కూడా అనుకుంటూ ఉంటారంట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ చెప్పడం విశేషం.

మరి ఆ కథ ఏమిటో చూద్దామా…‘వార్’ సినిమా షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ మంచి ఫిట్ నెస్ బాడీతో కనిపిస్తాడు. అలా కనిపించడానికి విపరీతమైన శారీరక శ్రమకు గురయ్యాడట. ఏ ఒక్కరోజు అలసిపోకుండా జిమ్ చేసేవాడంట. ఆ ఫిట్ నెస్ కాపాడేందుకు విపరీతంగా శరీరాన్ని ఇబ్బందిపెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో ఎందుకొచ్చిన జీవితం రా, బాబూ, చనిపోతే బాగుండు అని అనుకున్నాడంట.

‘వార్’ సినిమాకి ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్న ‘క్రిస్ గెతిన్’ చేసిన ఇంటర్వ్యూలో హృతిక్ ఈ విషయం చెప్పి అందరినీ ఆలోచనల్లోకి నెట్టేశాడు. అద్భుతమైన శక్తులున్న పాత్రతో క్రిష్ లాంటి సిరీస్ సినిమాలు చేసి, ఆపదలో ఉన్నవారెందరినో కాపాడి, అలాగే దేశాన్ని కాపాడిన క్రిష్ ఈ మాటన్నాడా? అని నెటిజన్లు హాశ్చర్యపోతున్నారు. మనుషులు అందరూ సమానమే. సినిమా హీరోలకి హృదయం ఉంటుంది, కష్టాలుంటాయి., నష్టాలుంటాయి. కానీ తెరపై కనిపించేటప్పుడు మాత్రం వాటన్నింటినీ దాచుకుని చేయడం మాత్రం కత్తి మీద సాములాంటిదేనని పలువురు వ్యాక్యానిస్తున్నారు.

జిమ్ లో కసరత్తులు

ఇక విషయానికి వస్తే హృతిక్ ఏం చెప్పాడంటే, నిజానికి అప్పుడు నేను సిద్ధంగా లేను. పాత్రకు తగినట్టుగా నా శరీరాకృతిని మార్చుకోవడం నా శక్తికి మించిన పనిగా మారింది. సినిమా పూర్తయ్యే నాటికి నా శక్తి అంతా హరించుకుపోయింది. అప్పుడే నాకు జీవితం మీద విరక్తి కలిగిందని అన్నాడు. అయితే పాత్రలో పెర్ ఫెక్షన్ కోసం జిమ్ లో ఎంతగానో ట్రై చేశాను. పక్కనే యువ హీరో టైగర్ ష్రాఫ్ ఒకడు…అతనిది మంచి ఫిట్ బాడీ, తనతో కలిసి ఆ కండలు చూపించడం పెద్ద సవాల్ గా మారిందని అన్నాడు.

అప్పుడు ట్రైనింగ్ కోచ్ గెతిన్ మాట్లాడుతూ ఆ సినిమా కోసం హృతిక్ ఏడు నెలలు నిర్వారమంగా కసరత్తులు చేశాడని చెప్పుకొచ్చారు. ఏనాడు సెలవు పెట్టలేదని అన్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సినిమాలో హీరోయిన్ గా వాణీ కపూర్ నటించింది. 2019 అక్టోబర్ 2న సినిమా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో హృతిక్ ‘రా’ ఏజెంట్ గా చేశాడు. ఆ తర్వాత విక్రమ్ వేద వచ్చింది. ఇప్పుడు ‘ఫైటర్’ సినిమాలో చేస్తున్నాడు.

వచ్చే సినిమాలన్నీ జిమ్ బాడీతో కనిపించే సినిమాలే రావడంతో హృతిక్ ఇబ్బందిపడుతున్నాడు. ఏదైనా సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్, కత్రినా కైఫ్ తో కలిసి చేసిన ‘‘జిందగీ నా మిలేగి దొబారా’’ లాంటి ఆఫ్ బీట్ సినిమాలు చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నాడంట. ఇదండీ సంగతి, సినిమా వాళ్లకు కష్టాలు ఉంటాయని, ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్