22.7 C
Hyderabad
Wednesday, December 4, 2024
spot_img

HIT 2 పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్

వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. సినిమా ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ శైలేష్‌కి, మన అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్స్ ఈ ట్రైలర్. ఇంత బాగా కట్ చేసిన శైలేష్, గ్యారికీ థాంక్స్. హిట్ యూనివర్స్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. హిట్ 3లోనూ నేను ఉన్నాను. అందుకే శైలేష్‌కు థాంక్స్. ప్యాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియెన్స్ అడుగుతుండేవారు. అందుకే నానితో మాట్లాడి.. పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. నానికి, ప్రశాంతికి థాంక్స్. నాతో ఈ సినిమాను నిర్మించినందుకు థాంక్స్. అన్నపూర్ణలో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియన్ సినిమాలే. క్షణం ట్రైలర్‌ను మహేష్‌ బాబు రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆయనే నన్ను మేజర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా చేశారు. ఈ ట్రైలర్ కట్ చేసేందుకు చాలా ఆలోచించాం. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంటుంది. శ్రీనాథ్ నాకు కాంపిటీషన్ అయ్యేలా ఉన్నారు. మీనాక్షి చక్కగా నటించారు. శ్రద్దా అద్భుతంగా నటించారు. అందరికీ ట్రైలర్ నచ్చినందుకు థాంక్స్.

డిసెంబర్ 2న హిట్ 2 రాబోతోంది. జాన్ ఎడ్డూరి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ పాకాల ట్రైలర్ కోసం పని చేశారు. ఎప్పుడూ ఫైట్లు చేసే నేను డ్యాన్సులు చేశాను. దిశా కేసు సమయంలోనే మొదటి పార్ట్ వచ్చింది. ఇప్పుడు శ్రద్దా వాకర్ కేసు జరుగుతోంది. కానీ ఇదంతా యాదృశ్చికంగానే జరిగింది. మేజర్‌లో చేసిన పాత్రకు హిట్ 2లో చేసిన పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు. స్క్రిప్టే రీసెర్చ్ చేసినట్టు ఉంది. సినిమాను హిందీలో రిలీజ్ చేయండని ఆడియెన్స్ అడుగుతుండటంతోనే మాకు కూడా ఆలోచన వచ్చింది. హిందీ వర్షన్‌లో కాస్త ఆలస్యంగా విడుదలవుతుంది. ఇక్కడ ఉండే ఇండియన్ సినిమాను చేస్తాను. కథ, డైరెక్టర్, నిర్మాత నాని ఇలా అందరి కోసం ఈ సినిమాను చేశాను. ఓ ఆడియెన్‌లా కథలో దర్శకుడికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చాను. పాన్ ఇండియన్ అనేది కథలో ఉండాలి. ఇమేజ్ ఉంది కదా? అని పాన్ ఇండియన్ చేయకూడదు.’ అని అన్నారు..

డైరెక్టర్ శైలేష్‌ కొలను మాట్లాడుతూ.. ‘ఈ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. సరిగ్గా నిద్రపోయి తొమ్మిది రోజులు అవుతోంది. సినిమా మూడ్ ఏంటో చెప్పేందుకు ట్రైలర్‌ను ఇలా కట్ చేశాం. అందుకే టీజర్‌ను అలా కట్ చేశాం. మా టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ అయితే నన్ను సొంత మనిషిలా చూసుకుంటారు. ఇలాంటి క్రైమ్‌ను చూపిస్తున్నప్పుడు స్టైల్ అని చూపించడం లేదు. ఓ మంచి చెడు మీద ఎలా గెలుస్తుందనేది చూపించాం. సమాజంలో జరిగే దానికే ప్రతీకగానే సినిమాలు ఉంటాయని ఈ ఘటనలు (దిశా, శ్రద్దా వాకర్) నిరూపిస్తున్నాయి. అలాంటి సైకోలకు సినిమాలే స్పూర్తి అని చెప్పలేం. మంచికి స్పూర్తిలా ఉండేలానే సినిమాలు తీస్తాం. హిట్ 3ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రకటిస్తాం. రొమ్ కామ్ సినిమాలు ఓటీటీలో చూసినా కూడా ఇలాంటి చిత్రాలు మాత్రం థియేటర్లోనే చూడాలి. నాని అనుభవాన్ని ఈ స్క్రిప్ట్ విషయంలో నేను వాడుకున్నాను.’ అని అన్నారు.

శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ‘హిట్ ప్రపంచంలోకి నేను రావడానికి డైరెక్టర్ శైలేష్‌ కొలను కారణం. నాకు ఈ పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. శేష్ అన్నతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు ఎంతో ముఖ్యమైనవి. మీనాక్షి మంచి నటి. వాల్ పోస్టర్ ప్రొడక్షన్, నాని , ప్రశాంతికి థాంక్స్’ అని అన్నారు.

నటి పావని మాట్లాడుతూ.. ‘హిట్ 2 ట్రైలర్‌ను మేం కూడా మొదటి సారి చూస్తున్నాం. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఆడిషన్ కాల్ వచ్చింది. శ్రద్దా పాత్రను ఆడిషన్ ఇవ్వండని డైరెక్టర్ చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్, పాటలకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ బాగుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది కదా? అందుకే డిసెంబర్ 2న థియేటర్లో సినిమాను చూద్దాం. ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. ఈ చిత్రంలో నాది చాలా ముఖ్యమైన పాత్ర. అదేంటో సినిమాను చూస్తే అందరికీ తెలుస్తుంది. ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు శైలేష్‌కు థాంక్స్’ అని అన్నారు.

Latest Articles

పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్న జగన్‌

పార్టీ బలోపేతంతోపాటు కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనుంది వైసీపీ. పార్టీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలో జరగనున్న సమావేశంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్