స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియను ఆపివేయాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తుదితీర్పునకు లోబడి ఉండాలని స్పష్టంచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు రైతులు.
కాగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారికైనా అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆర్5 జోన్ ఏర్పాటుచేసింది. ఇందుకోసం గుంటూరు జిల్లా నుంచి 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93ఎకరాల భూమిని కలెక్టర్లకు బదలాయించేందుకు అనుమతిస్తూ జీవో నెం.45ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో ఈ జీవోను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


