స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు పెద్ద ప్రమాదం జరిగింది. ‘తంగలాన్’ మూవీ షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విక్రమ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ మూవీలో హీరోగా విక్రమ్ నటిస్తున్నాడు. కాగా ఇటీవలే విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన ‘పొన్నియన్ సెల్వన్2’ మూవీ విడుదలై సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.