24.2 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

హీరోను సెలెక్ట్ చేసుకునే ముందు నా గురించి ఆలోచించండి: అడివి శేష్

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో బాలాజీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో.. హీరో అడివి శేష్ మాట్లాడుతూ – విజయ్ గారి బిచ్చగాడు 2 ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హత్య సినిమాకు అతిథిగా రమ్మన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా, తమిళ సినిమాలా లేదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉంది. దర్శకుడు బాలాజీ గారు ..మీ నెక్ట్ సినిమాలో హీరోను సెలెక్ట్ చేసుకునే ముందు నా గురించి ఆలోచించండి. ఇక్కడున్న సందీప్, మీనాక్షి, విజయ్ ఆంటోనీ, నేను మేమంతా స్వతహాగా ఎదిగిన వాళ్లం. మా రాతను మేమే రాసుకున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఇక మరో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘విజయ్ ఆంటోనీ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్ స్టోరీస్ ను సాధారణ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తుంటారు. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. విజయ్ గారి పాటలకు నేను అభిమానిని. దర్శకుడు బాలాజీ నాకు బాగా పరిచయం. హత్య ట్రైలర్ చూస్తుంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుందని బాలాజీ గారు చేసి చూపించారు. నిర్మాత బి ధనుంజయ్ గారు బై లింగ్వల్ ఫిల్మ్స్ చేసి తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు. మీనాక్షి అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్ అందుకుంటోంది. హత్య టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నా’’ అన్నారు.

హత్య చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ మా సినిమాలకు లక్కీ మస్కట్ లాంటి వారు. సందీప్ మార్నింగ్ షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చారు. శేష్ , సందీప్ కు థాంక్స్. బాలాజీ గారితో శేష్, సందీప్ ఇద్దరూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అతను మంచి టెక్నీషియన్. ఫిల్మ్ మేకింగ్ లో బాలాజీ గారికి పూర్తి అవగాహన ఉంది. హత్య సినిమా మేకింగ్ లో మా ప్రొడక్షన్ సంస్థలు ఎంతో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ మూవీస్ గుర్తొస్తాయి. గిరిష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్