17.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

TELANGANA: భారీ వర్షాలు.. వారికి సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లకు సెలువులు ప్రకటించారు. వరద ప్రభావంతో రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సెలవుల రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు అన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులకు డీఎంహెచ్‌వో గడల శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించారు. ఇంకా ఎవరైనా.. ఉద్యోగులు సెలవులో ఉంటే వెంటనే విధుల్లో చేరాలన్నారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులు తప్పకుండా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండి విధులు నిర్వహిస్తూ ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యారోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు.

Latest Articles

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ MRO కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్