24.6 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

Heavy Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

స్వతంత్ర వెబ్ డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్‌లో 17.1 సెం.మీ., మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14.1 సెం.మీ., వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.మీ., భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 11.8 సెం.మీ., కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా ఆందోలులో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటపురంలో 7.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ., హైదరాబాద్‌ షేక్‌పేటలో 6.6 సెం.మీ., ఖైరతాబాద్‌లో 4.7 సెం.మీ., మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో 5.6 సెం.మీ., కుత్బుల్లాపూర్‌లో 4.7 సెం.మీ., సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. సియర్‌ సూన్‌ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌లను, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్