Heavy Rains |హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, అసెంబ్లీ పరిసరాల ప్రాంతాల్లో అయితే ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా వాన దంచికొడుతోంది. భారీ వర్షాలకు రోడ్లు జలమయం కావడంతో రహదారులపై ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వర్షంలోనూ హనుమాన్ శోభయాత్ర కొనసాగుతోంది. మరోవైపు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఓవైపు ఎండలు ఉక్కపోతకు గురిచేస్తుంటే.. మరోవైపు వానలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో అయితే 40 డిగ్రీల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
Read Also: దేశానికే రోల్ మోడల్‌గా ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్
Follow us on: Youtube, Instagram, Google News