27.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

Bhatti Vikramarka: అతను ఆ మాట అనలేదు.. కావాలని బురద జల్లొద్దు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌‌బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో శ్రీధర్‌‌బాబు మాట్లాడుతుండగా అడుగడుగునా మంత్రులు అడ్డు తగిలారు. కాంగ్రెస్ నేతలు.. చెక్ డ్యామ్‌లు వద్దన్నట్లు తప్పుడు వాదనలు చేశారు. అసలు శ్రీధర్‌బాబును మాట్లాడనివ్వకుండా మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. శ్రీధర్‌బాబు ప్రసంగం పూర్తి కాకుండానే వెంటనే అక్బరుద్దీన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.

వాదోపవాదాలు..

శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా మంత్రి కేటీఆర్ మధ్యలో అడ్డు తగిలారు. విద్యుత్‌పై రేవంత్ కామెంట్స్‌ను ప్రస్తావించారు. వరదలపై సమాధానం చెప్పలేక కేటీఆర్ డైవర్ట్ చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే తాము చర్చకు సిద్దమని శ్రీధర్ బాబు సవాల్ విసిరారు.

మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న మాట అనలేదని, అధికార పార్టీ  కావాలని బురద జల్లొద్దని వివరణకోరారు. తాము వీడియో చూపిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే వరద నష్ట పరిహారం ప్రకటించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదని… వరదలకు ఇది కూడా ఒక కారణమని శ్రీధర్‌బాబు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం పుచ్చుకుని.. ఉప ద్రవం వచ్చింది కాబట్టి నష్టం జరిగింది.. ప్రభుత్వం మీద శ్రీధర్‌బాబు బురద జల్లొద్దని మంత్రి కోరారు.

Latest Articles

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్