పార్లమెంట్ ఎన్నికల వేళ హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్‌కు అందించారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. ఇవాళే కొత్త ముఖ్య మంత్రిని ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నట్లు తెలుస్తోంది.