మూసీ ఒడ్డున మూడు నెలలు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల ఉంటే తాను ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. పేదలకు పదివేల ఇళ్లు వస్తాయంటే తాను దేనికైనా సిద్ధమేనని అన్నారు. మూసీ ఒడ్డున మూడు నెలలు కాదు నాలుగు నెలలైనా ఉంటానని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మూసీ బఫర్ జోన్‌లో ఉండగా లేనిది తాను ఉండలేనా అంటూ కౌంటరిచ్చారు.