ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ, రేపు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగను న్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరిం చింది. ప్రధానంగా రేపు కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది నిన్న సూర్యుడు నిప్పులుకక్కాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడారు. అత్యధి కంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమో దైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండ లాల్లో 43 డిగ్రీల పైన నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది.