హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీస్ కానిస్టేబుల్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ప్రిజం పబ్‌లో జరిగింది.
ఓ కేసు విషయంలో నిందితుడు ప్రిజం పబ్‌లో ఉన్నాడనే సమాచారంతో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అక్కడికి వెళ్లారు. దొంగను పట్టుకోవడానికి వెళ్లిన సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రాం రెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పబ్‌లోని బౌన్సర్‌కు కూడా బుల్లెట్ గాయాల్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాకి చెందిన ప్రభాకర్‌పై వందకు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్ దగ్గర ఫైర్ చేశాడని తెలిపారు. ఈ ఘటనలో
వెంకట్ రెడ్డి అనే కానిస్టేబుల్‌కి గాయాలు అయ్యాయని వెల్లడించారు. బత్తుల ప్రభాకర్‌పై 75 నుండి 80 వరకు కేసులు ఉన్నాయని వివరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2023 నవంబర్ నుండి పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుడిపై నార్సింగ్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ వివరించారు.