స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధించిన 180పరుగుల లక్ష్యాన్ని 13బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. విజయ్ శంకర్ కేవలం 21బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(49) పరుగులతో రాణించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(32) రన్స్ చేయడంతో గుజరాత్ సునాయాసంగా విజయం సాధించింది. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్, నరైన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20ఓవర్లలో 179/7 పరుగులు చేసింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్ 39 బంతుల్లో 81 పరుగులతో వీరవిహారం చేశాడు. చివర్లో రస్సెల్(34) కూడా మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో షమి 3, నూర్ అహ్మద్, లిటిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.