స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ వలన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను ప్రభుత్వం అమలులోకి తీసుకురావడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ ఉండడం మూలంగా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 మరియు 3 వ తేదీలలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఈ వార్త విన్న అభ్యర్థులు అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ పరీక్షలను ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిపించాలంటే సిబ్బందిని కేటాయించడం కష్టంగా ఉంటుందన్న సమస్యను కలెక్టర్లు TSPSC దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం గురించి బాగా ఆలోచించిన TSPSC కలెక్టర్ల తో ఏకీభవించి పరీక్షలను నిర్వహించడం కుదరదు అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇక తదుపరి ఈ పరీక్షలను జనవరి 6 మరియు 7వ తేదీలలో నిర్వహించడానికి ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది, ముందు ముందు ఈ నిర్ణయం మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.