28.2 C
Hyderabad
Thursday, March 26, 2026
spot_img

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ విచారణకు సీబీఐకి గ్రీన్‌ సిగ్నల్‌

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్‌ తగిలింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది రౌస్‌ అవెన్యూ కోర్టు. ఇదే కేసు వ్యవహారంతో తీహార్‌ జైలులో ఉన్న ఆమెను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే వందల కోట్ల కుంభకోణంలో కవిత ప్రధానపాత్ర పోషించారని ఈడీ ఆరోపి స్తున్న తరుణంలో.. సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి..? ఏ విషయాలపై సీబీఐ ప్రశ్నించనుంది..? దర్యాప్తు ఏ మలుపు తిరగనుంది అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టుల సంచలన విషయాలు వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసకుంది. ఇప్పటికే జ్యుడీషి యల్ రిమాండ్‌ ఖైదీగా తీహార్ జైలులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేం దుకు సీబీఐ రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయిం చింది.ఈ పిటిషన్‌కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు అనుమతివ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే.. విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షం లోనే విచారించాలని షరతు పెట్టింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది.

   ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని.. ఈ స్కాంలో కవిత ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే,.. ఈ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పటంపై కవితను సీబీఐ విచారించనుంది. అలాగే బుచ్చిబాబు ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే,..ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకాలేదు కవిత. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని.. అది తేలేవరకు విచార ణకు హాజరుకానని తెలిపింది. ఇక ఇప్పుడు రెవెన్యూ కోర్టు అనుమతితో వచ్చే వారమే సీబీఐ ఆమెను ఎంక్వైరీ చేసే ఛాన్స్‌ ఉంది. విచారణ అనంతరం సీబీఐ మరో చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశము న్నట్టుగా తెలుస్తోంది.

  ఇదే కేసులో గత నెల 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్‌ వేసి అనుమతి తీసుకుంది సీబీఐ. మరోవైపు కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుండగా.. బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం, తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఇక బెయిల్‌పై జరిగిన విచారణలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వరాదని వాదించింది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని… ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. అయితే,.. కవిత తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని తాను దగ్గరు ఉండాలంటూ బెయిల్‌ పిటిషన్‌ వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో కేసు ఎలాంటి మలుపులు తిరగనుంది..? దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్