38.4 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో, ర‌మేష్ అనెగౌని ద‌ర్శ‌క‌త్వంలో, మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని నిర్మాత‌లుగా, రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘క‌ర్మ‌ణి’. ఈ మూవీ తాజాగా ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా దేవుని చిత్ర‌ప‌టాల‌పై సీనియ‌ర్ న‌టుడు నాగమ‌హేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చ‌వ‌న్ కెమెరా స్విచాన్ చేశారు. 2022లో డైరెక్ట‌ర్ ర‌మేష్ అనెగౌని తెర‌కెక్కించిన‌ ‘మ‌న్నించ‌వా..’ మూవీకి అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆధర‌ణ ల‌భించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో క‌లిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘క‌ర్మ‌ణి’. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ద‌ర్శ‌కుడు ర‌మేష్ అనెగౌని మాట్లాడుతూ.. ”ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రొరంభోత్స‌వం జ‌రిగే సినిమాలు సూప‌ర్ హిట్ కొడ‌తాయి. ఈ సెంటిమెంట్ మా ‘క‌ర్మ‌ణి’ సినిమాకు కూడా క‌లుగుతుంద‌ని విశ్వాసం ఉంది. మే మొద‌టి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌ప‌రుస్తాం”. అని అన్నారు.

నిర్మాత మంజుల చ‌వ‌న్ మాట్లాడుతూ.. ”ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో మా ‘క‌ర్మ‌ణి’ సినిమా ప్రొరంభోత్స‌వం జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇండ‌స్ట్రీకి ఒక మంచి సినిమా అందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం.” అని అన్నారు.

న‌టీన‌టులు: నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు.

బ్యాన‌ర్: రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్.
నిర్మాత‌లు: మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని.
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ అనెగౌని.
కెమెరామెన్: జ‌గ‌దీష్ కొమ‌రి.
సంగీతం: జాన్ భూష‌న్.
ఎడిట‌ర్: వి.నాగిరెడ్డి.
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: బ‌ల‌రాం బొమ్మిశెట్టి.
కో-డైరెక్ట‌ర్: బిక్షు.
పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌.

Latest Articles

ముక్కురాజ్ మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ నారాయణమూర్తి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్