Gold Price | బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు. ముఖ్యంగా భారత్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మొదలుకొని ఉన్నత వర్గాల వరకు చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బులను బంగారంపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎక్కువ సందర్భాల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు.. తమకు డబ్బులు అవసరమైన అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ పొందే వీలుండటంతో బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది బంగారం ధర ఎప్పుడు తగ్గితే అప్పుడు పసిడిని కొందామనే ప్లాన్‌లో ఉంటారు. అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో బంగారం, వెండి ఆభరణాలకు డిమాండ్ కూడా ఎక్కువుగానే ఉంటుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తునన పసిడి ధర.. బుధ, గురు వారాల్లో స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గురువారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పసిడి ధరలు మార్చి2వ తేదీ గురువారం కూడా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై సుమారు 150 రూపాయల వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 గా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290గా ఉంది.
విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290 గా ఉంది.
Gold Price: ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340గా ఉంది.
వెండి ధరలిలా..
Silver Price: గురువారం రోజు చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.70,200 పలుకుతోంది. అలాగే ముంబైలో కిలో వెండి ధర రూ.66,800 కాగా.. ఢిల్లీలో కిలో వెండి రూ.67,000 పలుకుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి రూ.70,200గా ఉంది.
Read Also: ఏపీలో డ్రగ్స్ మాఫియా.. నారా లోకేష్ కీలక అడుగు
Follow us on: Youtube