బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ , సి.ఆర్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మాతలుగా, గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందుతున్న హరర్ డ్రామా చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి మనోజమా పాత్ర గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి నటించారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.