తనను దూరం పెడుతున్నాడని ఆ యువతి ప్రియుడిపై కోపం పెంచుకుంది. తనను కాదన్న వాడిని వేధించాలని పన్నాగం పన్నింది. ప్రియుడి కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది. పోలీసుల విచారణలో ఆ యువతి నిర్వాకం బయటపడింది. ఆమె ఓ పోలీసు అధికారి కూతురు కావడం గమనార్హం.
హైదరాబాద్ కు చెందిన శ్రవణ్, రింకీ ప్రేమించుకుని విడిపోయారు. రింకీ పోలీసు అధికారి కూతురు.. అంతేకాదు ఆమె ఓ లా స్టూడెంట్ కూడా. తనను దూరం పెడుతున్న ప్రియుడు శ్రవణ్‌పై పగ పెంచుకుంది. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని పక్కా పథకం పన్నింది.
రింకీ 4 వేల రూపాయలతో గంజాయిని కొనుగోలు చేసింది. తర్వాత తన స్నేహితుల ద్వారా శ్రవణ్‌ను పిలిపించుకుని
అంతా కలిసి జూబ్లీహిల్స్ పబ్‌కు వెళ్లారు. శ్రవణ్‌కు తెలియకుండా కారులో గంజాయి పెట్టింది. శ్రవణ్ గంజాయి అమ్ముతున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు రింకీ ఫోన్ చేసి చెప్పింది.
పోలీసులు విచారించి రింకీతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.


