33 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

Hyderabad |గంజాయి బ్యాచ్‌ దారుణం.. డబ్బులివ్వలేదని బాలుడిని గుట్టల్లోకి తీసుకెళ్లి..

Hyderabad |రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది ప్రేమ మత్తులో హత్యలు చేస్తుంటే.. మరికొంతమంది చిన్న చిన్న కారణాలకే హత్యా నేరాలకు పాల్పడున్నారు. మరికొందరైతే కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. డబ్బులివ్వలేదనే కారణంగా గంజాయ్ బ్యాచ్ ఓ 17 ఏళ్ల అబ్బాయిని చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally)లో వెలుగులోకి వచ్చింది. కొందరు గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గంజాయి బ్యాచ్ కు డబ్బులు ఇవ్వనందుకు ఈ విధంగా యువకుడిని తీసుకెళ్లి చితకబాదినట్లు బాధితుడి పేరెంట్స్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకివచ్చింది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. కిరాణా దుకాణంలో కూర్చున్న యువకుడిని గంజాయ్(Ganja) బ్యాచ్ బలవంతంగా దగ్గర్లోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గంజాయికి డబ్బులు ఇవ్వాలంటూ బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారని బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. ఒంటిపై గాయాలను చూసిన బాలుడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Hyderabad | మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని హత్య చేశాం.. నిన్ను కూడా చంపేస్తాం.. ఎక్కడైనా చెప్పుకో అంటూ గంజాయ్ బ్యాచ్‌ బాలుడిని బెదిరించినట్లు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ కోసం వేతుకుటాట మొదలుపెట్టారు. కొంతకాలంగా మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. చాలా మందిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: BRS ఎమ్మెల్యేగా Dil Raju పోటీ?

Follow us on: Youtube

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్