39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

Gaganyaan: గగన్‌యాన్ మిషన్‌లో తొలి ప్రయోగానికి ఇస్రో రెడీ.. పరీక్ష ఎప్పుడంటే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని స్పేస్‌ సెంటర్‌లో అక్టోబర్ 21న ఉదయం 8.00 గంటలకు టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలిచిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ఇస్రో సూచించింది.  వ్యోమగాముల అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో గగన్‌యాన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యుల్‌, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్‌ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్‌ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్