G20 Summit 2023 |ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో అధికారికంగా ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జి-20 సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు మొత్తం 7 సెషన్స్, ఒక వర్క్ షాప్ జరుగనున్నాయి. 69 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మొదటి రోజు నాలుగు, రెండవ రోజు మూడు సెషన్లు జరగనున్నాయి. 30వ తేదీన జి 20 దేశాలు నుంచి వచ్చిన వారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
G20 Summit 2023 |ఈ సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్టణం వెళ్లనున్నారు. విశాఖపట్టణంలోని ఓ హోటల్ లో ప్రారంభంకానున్న జి-20 సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5గంటల15 నిమిషాలకు ఆయన విశాఖపట్టణం విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రుషికొండలోని జీ-20 సదస్సు ప్రారంభంకానున్న హోటల్ కు చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు జి-20 సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం జగన్ ముచ్చటిస్తారు. అనంతరం జరిగే గాలా డిన్నర్ లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు రుషికొండ నుంచి బయలుదేరి విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరతారు.
Read Also: నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. చర్చించే అంశాలివే..
Follow us on: Youtube , Instagram