ఓ వ్యక్తి తన సైకిల్ ను రోడ్డు మీద పార్క్ చేశాడు. అయితే ఆ సైకిల్ కు లాక్ వేయలేదు. దీంతో అటు వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొంతమంది యువకులు ఆ సైకిల్(bicycle)ని దొంగతనం చేయబోయారు. అంతే వారు ఒక్కసారిగా ముప్పుతిప్పలు పడ్డారు. అసలు మ్యాటర్ ఏంటంటే సైకిల్ ఓనర్ సీట్ భాగంలో మార్పులు చేశాడు. సీట్ కింద ఇనుప పైప్ సెట్ చేసుకున్నాడు. సైకిల్ మీద కూర్చునేటప్పుడు ఆ ఇనుప పైప్ ను కిందకు దించుకునేలా సెట్టింగ్ పెట్టుకున్నాడు. దీంతో దర్జాగా లాక్ వేయకుండా రోడ్డు మీదే సైకిల్ ను వదిలేశాడు. ఇది తెలియని కొంతమంది దొంగలు సైకిల్ దొంగతనం చేద్దాం అనుకున్నారు. అంతే అలా సైకిల్ సీట్ మీద కూర్చోగానే ఇనుప పైప్ పొడుచుకు రావడంత వారి బాక్స్ బద్దలైపోయింది. ఒకరు కాదు ఏకంగా నలుగురు దొంగనం చేస్తూ ఇలా ఇబ్బందులకు గురయ్యారు. సైకిల్ దొంగతనం దేవుడికెరుగు.. ముందు ఆ బాక్స్ నొప్పి నుంచి కోలుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. NO CONTEXT HUMANS అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. సైకిల్ యజమాని స్మార్ట్ ఐడియాకి హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేరు. అయితే కొంతమంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు.
— NO CONTEXT HUMANS 👤 (@HumansNoContext) March 29, 2023