పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి ఆకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్(95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1927లో జన్మించిన ఆయన 1947 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ సింగ్ మొత్తం 10సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేశారు. అత్యంత తక్కువ వయసు(43)లో, అత్యంత ఎక్కువ వయసు(84)లో సీఎంగా పనిచేసిన రికార్డు తన సొంతం చేసుకున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మరణవార్త పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


