స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్( Santosh Kumar) ప్రకటించారు. బంగారు తెలంగాణ కోసం కలిసి రావాలని సీఎం పిలుపుతో తాను కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తెలిపారు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్(Karimnagar) నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
2018లో ఎటువంటి పదవీ ఆశించకుండా బిఆర్ఎస్ పార్టీలో చేరానని, ఆ పార్టీ అభివృద్దికి ఎంతో కృషి చేశానని అన్నారు..అయితే వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎటువంటి అవకాశం లభించలేదని చెప్పారు. దీంతో రాజకీయ భవిష్యత్ కోసం బిఆర్ఎస్ ను వీడుతున్నట్లు చెప్పారు. శ్రేయోభిలాషులు, మిత్రులు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ఆశించే పెద్దల సలహా మేరకు రాబోయే ఎన్నిల్లో చురుకుగా పాల్గొని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తాను చేరబోయే పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.


