కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముదు రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 చూపించారని ఎంపీ ఎన్నికలు రాగాజనే మోసం పార్ట్- 2 పేరుతో ఓటు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్.. ప్రజలు ఒకసారి మోస పోతే అది నాయకుల తప్పు అవుతుందని రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పు అవుతుంద న్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. పదేళ్లుగా బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా కేవలం జైశ్రీరామ్ అంటోందని శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదన్నారు.


